నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 50 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, అందిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తు పరిష్కార స్థితిని సంబంధిత దరఖాస్తుదారులకు తెలియజేయాలని కూడా సూచించారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వస్తున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాధాన్యతతో స్పందించాలని సూచించారు.

దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదా పర్యవేక్షణ లోపం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవి శ్యాంప్రసాద్ లాల్, అమరేందర్, జిల్లా పరిషత్ సీఈఓ దేవ సహాయం, ఏవో చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు మరియు ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.: ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *