కల్వకుర్తి జేపీ నగర్ గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, తాడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలను డీఈఓ పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, బందోబస్తు, తాగునీటి సదుపాయం, ప్రథమ చికిత్స వంటి అంశాలపై అధికారులను ఆరా తీశారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
నేడు నిర్వహించిన గణిత పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో 10,650 మంది విద్యార్థులకు గాను 10,630 మంది హాజరయ్యారని తెలిపారు. 20 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. దీంతో మొత్తం 99.81 శాతం హాజరు నమోదైనట్లు వివరించారు. అలాగే ప్రైవేటు విద్యార్థులలో 6 మంది కూడా పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
పరీక్షలు పారదర్శకంగా, క్రమశిక్షణతో కొనసాగుతున్నాయని, మిగిలిన పరీక్షలు కూడా ఇదే విధంగా సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని డిఈఓ రమేష్ కుమార్ తెలిపారు.: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ

