ఈ కార్యక్రమాన్ని సంఘం తాలూకా అధ్యక్షుడు తీగల సుభాష్, కార్యదర్శి పాలమూరు సతీష్, కోశాధికారి తీగల జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అధ్యక్షుడు తీగల సుభాష్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా శ్రీరామనవమి సందర్భంగా టీటీడీ కల్యాణ మండపంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం పంపిణీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈసారి సుమారు 6,000 మందికి పైగా భక్తులకు సంపూర్ణ అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం అనంతరం భక్తులు అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.
అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 9985221162, 9966671731 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.: శ్రీరామనవమి సందర్భంగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద పంపిణీ
