నాగర్ కర్నూల్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం పాత కలెక్టరేట్ భవనం 102 గదిలో నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతంగా ముగిసినట్లు జిల్లా అందత్వ ప్రోగ్రాం అధికారి డాక్టర్ హెచ్. ప్రదీప్ తెలిపారు.
ఈ శిబిరంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన మొత్తం 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం క్యాటరాక్ట్ (ముత్యబిందు) సమస్యతో బాధపడుతున్న 41 మంది రోగులను గుర్తించి, వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేయించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా ఆప్తాలమిక్ అధికారి కోట్ర బాలాజీ రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. శిబిరాన్ని విజయవంతం చేయడంలో వైద్య ఆరోగ్య సిబ్బంది వై. శ్రీనివాసులు, సుకుమార్ రెడ్డి, నరసింహ, చెన్నకేశవులు, ప్రకాష్, సురేష్, ఎన్. వెంకటేశ్వర చారి, సురేష్ చారి, కళ్యాణ్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో కంటి శిబిరం విజయవంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *