నాగర్ కర్నూల్ రామాలయంలో వైభవంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు
నాగర్ కర్నూల్ రాంనగర్‌లోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు.
నాగర్ కర్నూల్ రాంనగర్‌లోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం జాతరకు అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో కృష్ణా నది బ్యాక్‌వాటర్ తగ్గడంతో సప్తనదుల సంగమ క్షేత్రంలోని ప్రాచీన సంగమేశ్వరాలయం పూర్తిగా దర్శనమిస్తోంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాలాన్ని తెలుసుకొని మెలిగితే దైవానుగ్రహం లభిస్తుందని అర్చకులు తెలిపారు.
బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులు తిలతైల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.