పోలీసుల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రజలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పోలీసులు పేర్కొన్నారు.
అంతేకాకుండా ఆందోళనకారులు నాగర్‌కర్నూల్ RDO కార్యాలయం వద్దకు చేరుకుని గేట్‌ను తోసుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించారని పేర్కొన్నారు.
ధర్నా కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, RDO కార్యాలయంలోకి దౌర్జన్యంగా ప్రవేశించేందుకు ప్రయత్నించడం వంటి అంశాలపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మీడియా మిత్రులకు సమాచారం విడుదల చేశారు. కేసుకు సంబంధించి తదుపరి చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.: BRS ధర్నాపై కేసులు..




