తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ తైలీ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన తెలంగాణ అభివృద్ధికి కీలకంగా ఉపయోగపడేదని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో విద్యారంగంతో పాటు వివిధ రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాల కోసం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, అవకాశాలు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పర్యటనకు ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు.

అయితే ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించేలా ఉందని తైలీ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన పర్యటనను అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

అలాగే బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకునేలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తైలీ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కోసం ముఖ్యమంత్రి చేపట్టే ప్రయత్నాలకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *