ఘనంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు
* వైభవంగా పడిపూజోత్సవం

నాగర్ కర్నూల్, ఏప్రిల్ 1
(తెలుగు ప్రభ): శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి జయంతిని బుధవారం ఉదయం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో భక్తుల భజనల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుందర్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి గవ్వమఠం విజయ శాస్త్రి శాస్త్రోక్తంగా అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించారు. పట్టణానికి చెందిన అయ్యప్ప స్వామి భక్తులు నిర్వహించిన భజనల కీర్తనల మధ్య అత్యంత వైభవంగా పడిపూజోత్సవాన్ని నిర్వహించారు. సందర్భంగా పడిని గురుస్వాములు సుందర్ గురుస్వామి, తీగల శేఖర్ గురుస్వామి, జగన్ గురు స్వామి తదితరులు వెలిగించగా భక్తులు తిలకించారు. ఇంకా ఈ పూజా కార్యక్రమంలో గురు స్వాములు అనిల్ గురుస్వామి, మురళి గురు స్వామి, శేఖర్ గురుస్వామి, ప్రవీణ్ గురు స్వామి, సురేష్ గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.‌ అనంతరం భక్తులకు ఆలయ ప్రధాన పూజారి గవ్వమఠం విజయ శాస్త్రి ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.‌

రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ రోగి సహాయకులకు అన్న ప్రసాదం

శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి జయంతిని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం స్థానిక శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సాధారణ ఆసుపత్రిలో రోగులకు బ్లడ్ పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఆస్పత్రిలోని నిత్య అన్న ప్రసాద కేంద్రంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు పసుపుల సురేందర్ గురుస్వామి తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోగి సహాయకులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్ వార్డులో జరిగిన కార్యక్రమంలో జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్టి ఉషారాణి పలువురు పలువురు డాక్టర్లతో కలిసి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయం కమిటీ రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడంతో పాటు రోగి సహాయకులకు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఒకవైపు భక్తి భావంతో కొనసాగుతూనే మరోవైపు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు పసుపుల సురేందర్, నేతలు తిరుపతయ్య, సుదర్శన చారి, కానాపురం ప్రవీణ్ కుమార్, అనిల్, జగన్, నవత నరేష్, సురేష్, సునీల్, ఉమా శంకర్, ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విజయ్ శాస్త్రి తదితరులు రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అన్నప్రసాద వితరణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు శ్రీ సత్య సాయి సేవా సమితి నేతలు కూడా పాల్గొన్నారు.‌: వైభవంగా పడిపూజ, సేవా కార్యక్రమాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *