ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన జిపిఎఫ్, ఆరోగ్య బీమా, మెడికల్ బిల్లులు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటం సరైంది కాదని పేర్కొన్నారు. వెంటనే వాటిని చెల్లించి ఉపాధ్యాయులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే రెండవ పీఆర్‌సీని ప్రకటించి అమలు చేయాలని, పర్యవేక్షక పోస్టులైన ఎంఈఓ, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎస్ మురళి, కార్యదర్శి కొత్త శ్రీధర్ రావు, మండల నాయకులు మరియు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి


