నాగర్ కర్నూల్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్పై బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ డి. రమాకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో ఈ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు.

ఈ లోక్ అదాలత్లో భూ వివాదాలు, రాజీ చేసుకునే క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ సంబంధిత కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు సంబంధిత కేసులు తదితర పెండింగ్ కేసులను సత్వరంగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. “రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొంటూ, లోక్ అదాలత్ ద్వారా అప్పీల్కు అవకాశం లేని తీర్పులు లభిస్తాయని, తద్వారా సమయం మరియు డబ్బు ఆదా అవుతాయని వివరించారు.

ఇరువర్గాలు పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల సుఖసంతోషాలతో జీవించవచ్చని ఆయన సూచించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో స్పెషల్ జడ్జి (పోక్సో కోర్టు) నసీం సుల్తానా మాట్లాడుతూ కక్షిదారులు పగలు, ప్రతీకారాలను పెంచుకోకుండా రాజీ చేసుకోవడం ద్వారా మానవ సంబంధాలు బలపడతాయని అన్నారు. కోర్టుల చుట్టూ సంవత్సరాల పాటు తిరగకుండా, లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవడం గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు.: మార్చి 28న జాతీయ లోక్ అదాలత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *