నాగర్‌కర్నూల్:జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ (IPS) అచ్చంపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్, సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.

ఆఫీస్‌, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని, వారు అందించే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కింది స్థాయి సిబ్బందికి బాధితులకు సకాలంలో సహాయం అందించే విధంగా అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

అచ్చంపేట ప్రాంతంలోని స్థానిక రౌడీషీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సబ్ డివిజనల్ కార్యాలయం, సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, రైటర్, ఇతర సిబ్బంది పనితీరును సమీక్షించి విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు.

డీఎస్పీ కార్యాలయం, సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న ఎస్పీ.. కేసులు పెండింగ్‌లో లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అచ్చంపేట డీఎస్పీ, సిద్ధాపూర్ ఎస్సైని ఆదేశించారు.

కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది క్రమశిక్షణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ పోలీస్ సిబ్బందిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, తమ్రాబాద్ సీఐ చంద్రయ్య, డీసీఆర్బీ ఎస్సై రమేష్, అచ్చంపేట ఎస్సై నరేష్, సిద్ధాపూర్ ఎస్సై అంజయ్యతో పాటు సబ్ డివిజన్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
: సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *