బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలర్మేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం రెండో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణంతో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను వేదమూర్తులైన బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు కొరవి రామానుజాచార్యులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 36 కుటుంబాల దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారని తెలిపారు. భక్తులు తమ కుటుంబాల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించారు.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తక్కువ ఖర్చుతో ఆచరించి ఆధ్యాత్మిక ప్రయోజనం పొందవచ్చని అర్చకులు భక్తులకు తెలిపారు. భక్తుల కోరిక మేరకు ఆలయంలో ప్రతిరోజూ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

కళ్యాణ మహోత్సవం, వ్రతాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీ బాలాజీ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందించారు. డాక్టర్ పి. గోపాల్, శేఖర్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్, ఆలయ సిబ్బంది బాబయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.: వెంకన్న ఆలయంలో వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *