తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లాలోని ZPHS, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారానికి రెండు రోజులు ఆయా పాఠశాలలకు వెళ్లి ప్రొజెక్టర్లతో ప్రాక్టికల్‌గా పాఠాలను వివరిస్తున్నారు.
ఈ తరగతుల్లో కృత్రిమ మేధస్సు (AI) ప్రాథమిక భావనలు, పైథాన్ మరియు స్క్రాచ్ కోడింగ్, లాజికల్ థింకింగ్, సైబర్ సెక్యూరిటీ, సేఫ్ ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ టూల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ వంటి అంశాలను బోధిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్ల ద్వారా ప్రాక్టికల్‌గా నేర్పించడంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి కృషి కీలకంగా ఉందని కళాశాల వర్గాలు తెలిపాయి. ముందుగా డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి, సర్టిఫికెట్లు అందించిన అనంతరం వారిని మెంటార్లుగా పాఠశాలలకు పంపిస్తున్నారు.
ఈ కార్యక్రమంతో పాఠశాల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందడంతో పాటు, డిగ్రీ విద్యార్థుల్లో బోధనా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యలో డిజిటల్ మార్పుకు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేపడుతున్న ఈ కార్యక్రమం మంచి ఉదాహరణగా నిలుస్తోంది.: ప్రభుత్వ కళాశాల నుంచి అంతర్జాతీయ సాంకేతికత వైపు..


