ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా భక్తుల కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ లక్కీ డ్రాలో 14వ వార్డుకు చెందిన హకీమ్ విహాస్ లడ్డూను కైవసం చేసుకున్నారు. లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన హకీమ్ విహాస్కు హనుమాన్ బృందం అధ్యక్షుడు రవి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు హకీమ్ విహాస్తో పాటు కుటుంబ సభ్యులందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. గణేశ్ ఉత్సవాల్లో భక్తులు, కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం లక్కీ డ్రాలో గెలుచుకున్న లడ్డూను హకీమ్ విహాస్కు నిర్వాహకులు అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ద్వారా కాలనీలో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.: లక్కీ డ్రాలో లడ్డూ కైవసం చేసుకున్న హకీమ్ విహాస్..
