నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండలం మల్లేశ్వరం ఐల్యాండ్‌లో పర్యాటక అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 47.44 కోట్ల రూపాయల వ్యయంతో 30 కాటేజ్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనులకు SASCI (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి.
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టగా, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధుగం బాలీశ్వరమ్మ నరసింహ యాదవ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిసెంబర్ చివరి నాటికి కాటేజ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2027 సంవత్సరం నుంచి మల్లేశ్వరం ఐల్యాండ్‌ను పర్యాటకులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే యోచనలో ప్రభుత్వం ఉంది.

గ్రామ అభివృద్ధికి సహకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు గ్రామ ప్రజల తరపున సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు.: మల్లేశ్వరం ఐల్యాండ్‌లో కాటేజ్‌ల నిర్మాణం వేగంగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *