ధన్నోజు నరేష్ చారి 2010 నుంచి బీజేపీతో అనుబంధంగా కొనసాగుతూ గత 16 ఏళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఏబీవీపీ నాయకుడిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, బీజేపీ యువ నాయకుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన, రెండుసార్లు బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్‌గా సేవలందించారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కీలక ఘట్టంగా మారింది.
సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొన్నారు. కరోనా సమయంలో పేద కుటుంబాలకు సహాయం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు, ఆర్థిక సాయం అందించడం, దేవాలయాలకు విరాళాలు అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా ధన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. యువ మోర్చాను జిల్లా వ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తూ యువత, విద్యార్థులు, పేద ప్రజలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.: బీజేపీ యువ మోర్చా నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ధన్నోజు నరేష్ చారి నియామకం
