Category: Crime

నేరాలకు సంబంధించిన తాజా వార్తలు, పోలీస్ విచారణలు, కేసుల వివరాలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన సమాచారం.

ఏసీబీ వలలో తిమ్మాజిపేట ఎస్సై

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

తెలంగాణ హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్స్ బిల్ 2026

తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్ పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు చేసిన ముఖ్య వ్యాఖ్యలు.

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్

మార్చి 28న నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి డి. రమాకాంత్ తెలిపారు. పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం పొందే అవకాశం ఉందన్నారు.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ కేసు విచారణలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

జిల్లాలో యువకుడి హత్య కేసు వెలుగు : ముగ్గురు నిందితులు అరెస్ట్

నాగర్‌కర్నూల్ జిల్లాలో యువకుడి హత్య కేసు కలకలం రేపింది. పాత వైరం కారణంగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నాగర్ కర్నూల్‌లో మైనర్ గర్భధారణ కేసు సంచలనం

నాగర్ కర్నూల్ జిల్లాలో మైనర్ గర్భధారణ కేసు విచారణలో కీలక మలుపు తిరిగి, అసలు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలిక గర్భధారణ కేసు: బాలుడిపై పోక్సో కేసు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని స్కానింగ్ కేంద్రంలో ప్రసవించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి 17 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

పాలెం చిన్నారి మృతి ఘటనపై వేగవంతమైన విచారణ చేపట్టాలి

పాలెం గ్రామంలో మూడు నెలల చిన్నారిని నీటి తొట్టిలో వేసి హత్య చేసిన ఘటనపై వేగంగా విచారణ పూర్తి చేసి నిందితులను గుర్తించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.