ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లక్షలాది మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరోగ్య రంగంలో విశేష అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, నర్సింగ్ అధికారులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
జిల్లాలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు. మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని, కొత్త వ్యాధుల నివారణలో తెలంగాణ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సాధారణ చికిత్సల నుంచి వెంటిలేటర్ సేవల వరకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రసవాలు, శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
వేడుకల్లో భాగంగా సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ రవి శంకర్ రచించిన తెలంగాణ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. కార్యక్రమంలో నర్సింగ్ సూపర్డెంట్ మంజుల, ఏ.డి.సి.జే. వసంత్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రవి శంకర్, డాక్టర్ హనుమంత్ రావు, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రోహిత్, కార్యాలయ సూపర్డెంట్ రామచంద్రయ్యతో పాటు పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.: ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు




