**తెలకపల్లి:** తెలకపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా దివ్యాంగుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షులు నారందాస్ శ్రీశైలం, జిల్లా కార్యదర్శి మొల్గర పరశురాములు తెలిపారు.

మండల దివ్యాంగుల కమిటీ అధ్యక్షులుగా బోడ వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా నాగనూలు శివరాం, కోశాధికారిగా గువ్వల సుదర్శన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులుగా చెటమొని కాంతయ్యను ఎన్నుకున్నారు.

అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా శ్యామ్, గణేష్, ఆంజనేయులు, శివప్రసాద్ గౌడ్, రవి, రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నారందాస్ శ్రీశైలం మాట్లాడుతూ.. తెలకపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నివసిస్తున్న దివ్యాంగుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హక్కులు, అవసరమైన సహాయ సహకారాలు అందేలా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని తెలిపారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మండలంలోని దివ్యాంగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, పరిష్కార దిశగా పనిచేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యానమోని రామకృష్ణ, వడ్డేమాన్ రాజు, మంతటి కృష్ణ, శేఖర్‌తో పాటు పలువురు దివ్యాంగులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

: తెలకపల్లి మండల దివ్యాంగుల పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *