తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ…
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేసి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేసి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డా. విశారదన్ మహరాజ్ అరెస్టును ఖండిస్తూ నాగర్‌కర్నూల్‌లో BC, SC, ST JAC మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసి) ముందు అన్ని రకాల బస్సులు ఆగేలా రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని టీఎన్జీవో యూనియన్ నేతలు ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ కార్యక్రమం కింద మార్చి 29న FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. జిల్లాలో 25,313 మంది మహిళలు మరియు వయోజనులు ఈ పరీక్షకు…
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
2027 జనగణన ప్రక్రియ దేశాభివృద్ధికి కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణను అధికారులు సమన్వయంతో, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్‌పీవీ టీకా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. అర్హులైన బాలికలు ఆధార్ జిరాక్స్ కాపీతో తల్లిదండ్రులతో కలిసి రావాలని వైద్యాధికారులు సూచించారు.
నాగర్ కర్నూల్ సాయి స్నేహ ఎలైట్ అపార్ట్మెంట్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మునిసిపల్ చైర్మన్ తీగల సునింద్ర తెలిపారు.