ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వారిని అభినందించారు. ఆయన తన చేతుల మీదుగా నూతన హోదాకు సంబంధించిన స్టార్స్‌ను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం ఉన్నత స్థాయికి ఎదగడమే కాకుండా మరింత బాధ్యతలను తీసుకురావడమని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ప్రజలతో సానుభూతితో వ్యవహరించి, ప్రతి బాధితుడికి తక్షణ సహాయం అందించాలన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, నిరుపేదలు వంటి బలహీన వర్గాలకు పోలీసులు అండగా నిలవాలని సూచించారు.
క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో పనిచేస్తేనే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరుగుతుందని ఎస్పీ తెలిపారు.: నాగర్ కర్నూల్‌లో ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సై పదోన్నతి



