లింగాల: పేదల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు పండుగ సాయన్న అని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. లింగాల పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పండుగ సాయన్న చేసిన పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. పేదలు, బడుగు వర్గాల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

ముదిరాజ్ సోదరులు కష్టజీవులు, నిబద్ధత కలిగిన నాయకులని, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ముదిరాజ్ సమాజం ఐక్యతగా ముందుకు సాగుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు.

పండుగ సాయన్న ఆశయాలను కొనసాగించేందుకు ముదిరాజ్ సంఘంతో పాటు ప్రజలందరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. లింగాలలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పండుగ సాయన్న పోరాట పటిమ, ముదిరాజ్ సోదరుల ఐక్యతే సమాజానికి బలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

: సాయన్న ఆశయ సాధనకు ఐక్యంగా నిలబడాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *