పాఠశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన డీఈఓ, అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరీక్షించారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఆహారం సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
అనంతరం తరగతి గదులు, డైనింగ్ హాల్, కిచెన్ను పరిశీలించి, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేజీబీవీ పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఘటనలపై విద్యార్థినులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై, పరీక్షలను ప్రశాంతంగా, ధైర్యంగా రాయాలని సూచించారు. చదువులో దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు.
విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగించాలని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు.: తిమ్మాజీపేట కేజీబీవీపై డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ




