ఈ సందర్భంగా పెద్దయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేకంగా “బీసీ రక్షణ చట్టం” తీసుకురావాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రతీ ఏడాది ₹20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
బీసీలకు కేటాయించిన బడ్జెట్ను కూడా పూర్తిగా ఖర్చు చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితం చేశారని అన్నారు. గత మూడేళ్లలో బీసీల కోసం కేటాయించిన నిధుల వినియోగంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత 13 సంవత్సరాలుగా బీసీ యువకులకు కార్పొరేషన్ రుణాలు అందకపోడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటోందని విమర్శించారు. బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు రేణుక, నాయకులు లలిత, నిరంజన్ యాదవ్, సుధాకర్ గౌడ్, గడుసు మధు, గంగోజి శ్రీకాంత్, రాజు, మహేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.: బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి
