అటవీ శాఖ ప్రకారం, ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో మూడు నెలల కాలానుగుణ సీజనల్ క్లోజర్ అమల్లో ఉంది. ఈ సమయంలో పులులు, చిరుతలు సహా ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తి మరియు సహజ జీవావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా కోర్ ఏరియాలో మానవ సంచారాన్ని పూర్తిగా నియంత్రిస్తున్నట్లు వెల్లడించారు.
అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించే వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరించింది. భక్తులు, స్థానిక ప్రజలు నిబంధనలను గౌరవించి అటవీ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, అరుదైన వన్యప్రాణుల భద్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. తాత్కాలికంగా విధించిన ఈ ఆంక్షలను ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర కోరారు.: లోద్ది జాతరకు అటవీ శాఖ అనుమతి నిరాకరణ…
