విద్యార్థులు యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా మారాలి
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.
పొగ త్రాగడం వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదం. పాసివ్ స్మోకింగ్ వల్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం నో…
సృజనాత్మక ఆలోచనలతో మహిళలు ఆకర్షణీయమైన ఉత్పత్తులు తయారు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను కలెక్టర్ ప్రశంసించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజలకు అందించే త్రాగునీరు పూర్తిగా శుద్ధితో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
చారకొండ మండలం సిర్సనగండ్ల అయోధ్యనగర్ గుట్టపై జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు/జాతర ఏర్పాట్లపై అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్‌గా షాన్ వాజ్ ఖాన్ బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.