నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాళ్ళ నిరంజన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్య యాదవ్ మాట్లాడుతూ, గత 75 సంవత్సరాలుగా బీసీలు రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలలో బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించకుండా, 2021 జనాభా ఆధారంగా లోక్‌సభ మరియు అసెంబ్లీ స్థానాలను పెంచితే, బీసీలకు పాలనలో భాగస్వామ్యం మరింత దూరమవుతుందని పేర్కొన్నారు.
బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్న జనాభా గణనలో బీసీ కులాల గణన తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలలో బీసీలు మరియు బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ధోరణి చూస్తుంటే, పార్లమెంట్ స్థానాల పెంపులో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్, యువసేన జిల్లా అధ్యక్షుడు నేష లక్ష్మయ్య, సదుర్ల తిరుపతయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు రేణుకమ్మ, మౌలాన, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.: బీసీల జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానాల పెంపు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *