తల్లి-శిశు ఆరోగ్యం, టీకాలు, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
వ్యాధి నివారణలో అవగాహన కీలకమని ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని, ముఖ్యంగా ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు




