నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ జేష్ఠ మాత సమేత శనేశ్వర స్వామి ఆలయంలో 26వ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వర స్వామి వ్రతం, శాస్త్రోక్తంగా శాంతి, దుర్గ, రుద్ర హోమాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం, శనేశ్వర స్వామి పునః ప్రతిష్టించి నేటికి 26 సంవత్సరాలు పూర్తయ్యాయి.

బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా మండల ఎస్.ఐ. శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదమూర్తులైన అర్చక బృందం ఆధ్వర్యంలో ఉమామహేశ్వర వ్రతాన్ని నిర్వహించారు. ఈ వ్రతం ద్వారా సకాలంలో వర్షాలు, పాడిపంటల సమృద్ధి, ప్రకృతి విపత్తుల నివారణ, అష్ట ఐశ్వర్యాల ప్రాప్తి కలుగుతుందని అర్చకులు వివరించారు.

పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉమామహేశ్వరులకు పంచామృతాభిషేకాలు, వినాయక స్వామికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన చేసి భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో రుద్ర హోమం, దుర్గ హోమం, శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు బండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.: వైభవంగా ఉమా మహేశ్వర స్వామి వ్రతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *