నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బిజినపల్లి మండలంలోని పాలెం ఇండస్ట్రియల్ పార్క్ ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ కర్మాగారాన్ని సందర్శించారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ మరియు కళాశాల ఈకో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారి దివ్య పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ముఖ్య అంశాలను వివరించారు. ఫిలిక్స్ ఎకో గ్రీన్ ఎనర్జీ సంస్థకు చెందిన పారిశ్రామికవేత్త వేణు తుమ్మల ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియ, దాని ప్రయోజనాలను ప్రదర్శనతో సహా వివరించారు.

ప్రిన్సిపాల్ మదన్ మోహన్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా విద్యార్థుల్లో బాధ్యతాభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పాలెంలో స్థాపించబడిన ఈ రీసైక్లింగ్ కేంద్రం ద్వారా వ్యర్థ ప్లాస్టిక్ను ఆయిల్, గ్యాస్, కార్బన్గా మార్చుతున్నారని పేర్కొన్నారు.

ప్రతిరోజూ సుమారు 5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఈ యూనిట్ తోడ్పడుతోంది. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *