Tag: nagarkurnool

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం పంపిణీ

పంతుల బాజీరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలి

అచ్చంపేట మున్సిపాలిటీలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8.68 లక్షల బస్తాల యూరియా రైతులకు అందించగా, 66 వేల మందికి పైగా రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేశారు.

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సిబ్బంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని డాక్టర్ వి. శేఖర్ మరియు డాక్టర్ రవికుమార్ నాయక్ ప్రారంభించారు.

నాగర్‌కర్నూల్‌లో ప్రిజం విద్యాసంస్థ దశాబ్ది వేడుకలు ఘనంగా

నాగర్‌కర్నూల్‌లోని ప్రిజం విద్యాసంస్థ స్థాపనకు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 95 టీంల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.

విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డీఈఓకు బహుజన ప్రజాశక్తి వినతి

నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యా హక్కు చట్టం (RTE) సమర్థంగా అమలు చేయాలని కోరుతూ బహుజన ప్రజాశక్తి నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారిని (DEO) కలిసి వినతి పత్రం సమర్పించారు. బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఈ…

పదో తరగతి విద్యార్థులకు వార్డెన్ రాధా ఆల్ ది బెస్ట్

నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థినులకు వార్డెన్ రాధా ప్రోత్సాహకరంగా సూచనలు చేస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించి హాస్టల్‌కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఎర్రమంజిల్ జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం

హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి (HPV) వాక్సినేషన్ కార్యక్రమాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. బాలికలను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఈ టీకా ఎంతో అవసరమని వైద్యాధికారులు తెలిపారు.

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వేసవి కాలంలో రక్త కొరతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.