ఇంటర్, టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 60 కేంద్రాల్లో 25 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, భద్రత, మౌలిక వసతులు, రవాణా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు.
కుమ్మెర గ్రామ జాతర ఘటనపై మూడు కేసులు నమోదు
కుమ్మెర జాతర ఘటనపై నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు కేసులు నమోదు – శిశు మృతి దర్యాప్తు కొనసాగింపు – ముగ్గురు నిందితుల అరెస్ట్, ఆరుగురు పరారీ.
జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరుకు టిడబ్ల్యూజేఎఫ్ వినతి
నాగర్ కర్నూల్‌లో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పారదర్శకంగా మంజూరు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.
ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు
నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వినతులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
పదో తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు
నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు 60 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కుమ్మెర చిన్నారి హత్య ఘటనపై డీజీపీకి వినతిపత్రం
కుమ్మెర జాతరలో చిన్నారి హత్య ఘటనపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చిన్నారి హత్య ఘటనపై సీపీఎం ఆందోళన
కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై సీపీఎం ఆందోళన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది.
కుమ్మెర బాధితులకు సత్వర న్యాయం
కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాగర్ కర్నూల్‌లో నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.
కుమ్మెర ఘటనపై బీజేపీ ఓబీసీ మోర్చా ఆగ్రహం
కుమ్మెర గ్రామ ఘటనలో చిన్నారి మృతి నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా డిమాండ్ చేసింది. నిందితులను శిక్షించకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని ఆనంద్ గౌడ్ హెచ్చరించారు.
గౌడ కౌన్సిలర్లకు ఘన సన్మానం
నాగర్ కర్నూల్‌లో జై గౌడ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ గౌడ కౌన్సిలర్లకు శాలువాలతో ఘన సన్మానం నిర్వహించారు.
