ఆలేరు ఉపకేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న ఏ. నిరంజనమ్మ రాష్ట్రస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తీసుకువచ్చారని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శాలువా కప్పి బంగారు పతకం మరియు ప్రశంస పత్రాలు అందజేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ 400 మీటర్ల రేసులో చివరి క్షణం వరకు నిరంజనమ్మ చూపిన పట్టుదల ఆమె గెలుపు తపనకు నిదర్శనమని ప్రశంసించారు. రాష్ట్రస్థాయిలో పాల్గొని విజయం సాధించడం జిల్లాకు గౌరవం తెచ్చిందన్నారు. భవిష్యత్తులో మరింత శ్రమించి జాతీయస్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.
ఆరోగ్య సేవలందిస్తూ క్రీడల్లో కూడా రాణించడం ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి నాయక్, డీఐఓ సురేష్ బాబు, డాక్టర్ నాగేశ్వరి, తెలకపల్లి సర్పంచ్ కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.: ప్రతిభ చూపిన ఆరోగ్య కార్యకర్త నిరంజనమ్మ


