-నిజ నిర్ధారణ కమిటీ పేరుతో కాంగ్రెస్ డ్రామా.
-కాంగ్రెస్ కుట్రలను సమాజం గుర్తించింది.
-అక్రమ కేసులతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల పైశాచిక ఆనందం
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుమ్మెర సంఘటనలో మృతి చెందిన చిన్నారి పాప కుటుంబానికి అండగా నిలిచేందుకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులను నిలదీస్తూ ఆందోళనకు మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ కి చెందిన కొందరు ప్రజా సంఘాల ముసుగులో మాజీ ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తూ డబ్బులు ఇచ్చి ఉద్యమాన్ని నిర్వహించారని పేర్కొనడం దారుణమని బిఆర్ఎస్ నాయకులు ఐతోల్ లక్ష్మయ్య మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ మాజీ జెడ్పిటిసి శ్రీశైలం నాయకులు జోగు ప్రదీప్ కౌన్సిలర్ తిమ్మాజీపేట పాండు మండిపడ్డారు సోమవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐతోల్ లక్ష్మయ్య మాట్లాడుతూ 18న కుమ్మెర గ్రామంలో చాకలి సామాజిక వర్గానికి చెందిన గణేష్ పై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని చిన్నారి పాప మృతికి కారణమైన వారందరిపై హత్య కేసు నమోదు చేయాలని అనేక ప్రజా సంఘాలు ఆందోళన చేస్తే విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధితుల పక్షాన అండగా నిలిచేందుకు ఆందోళనలో పాల్గొని పోలీస్ అధికారులు నిలదీయడం మానవత్వంతోనే చేయడం జరిగిందని దీనిని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రజాసంఘాల ముసుగులో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మర్రి జనార్దన్ రెడ్డి పై విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. ఎన్నో ఉద్యమాలు చేసిన వారు కూడా బాధితుల పక్షాన నిలవకుండా నిందితులకు కొమ్ముకాసేందుకు బీసీ నేతలపై విమర్శలు చేయడం తగదన్నారు బాధితులు లేకుండానే నిజ నిర్ధారణ కమిటీ గ్రామంలో రాజకీయం చేసిందని ఆరోపించారు. సంఘటనలో దోషులను శిక్షించాలని బిజెపిని ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతోపాటు కేటీఆర్ ను తీసుకువచ్చి వారి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించే విధంగా కృషి చేశామని తెలిపారు సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసును నీరుగాచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బాధితుల పక్షం నిలవకుండా నిందితులకు అండగా నిలుస్తూ ఆందోళన చేసిన దళిత బీసీ లా నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకే మానవత్వంతో మరణి జనార్దన్ రెడ్డి కృషి చేశారని ప్రజాసంఘాల పేరుతో ఉద్యమాన్ని నిరుగారిస్తే సహించమని హెచ్చరించారు కొందరు నేతలు నిందితుల పక్షాన ఉంటూ చావడానికి కారణమైన వారికి కొమ్ముకాస్తూ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సమాజం గుర్తించారని అన్నారు. దీక్షా శిబిరం వద్దకు ఎందుకు వెళ్లి బాధితులకు సంఘీభావం తెలుపలేదని మరి జనార్దన్ రెడ్డి బాధితులకు ధైర్యం చెప్పేందుకే కృషి చేశారని అన్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలాంటి దారుణం జరిగిన ఎందుకు స్పందించలేదని నిలదీశారు ఇక్కడి కొందరు నేతలు ప్రజా చైతన్యాన్ని బలహీనపరిచేందుకు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారని ఖండించారు మాజీ జెడ్పిటిసి శ్రీశైలం మాట్లాడుతూ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిని డబ్బులు పోయారని వ్యాఖ్యలు చేస్తూ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగదని అన్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమం చేయగా తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన ఉండకుండా ఒక వర్గానికి కొమ్ముకాస్తూ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు సమావేశంలో జోగు ప్రదీప్ మాట్లాడుతూ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మర్రి జనార్దన్ రెడ్డి బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా బాధితుల ఆందోళనకు అండగాలిచి పోలీసులను నిలదీయడంతో పాటు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ని విమర్శలు చేయడం తగదని నిందితులకు కొమ్ము కాసేందుకు విమర్శలు చేయడం నిజ నిర్ధారణ కమిటీ పేరుతో కాలయాపన చేయడం కాదని బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేసేందుకు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో కౌన్సిలర్ తిమ్మాజీపేట పాండు మాట్లాడుతూ గణేష్ పై దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సంఘటన తమకు తెలియదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని నిలదీశారు. ఆందోళనలు ఉవ్వెత్తున జరుగుతున్న తమకు తెలియదని పేర్కొనడం పాలనపై పట్టు కోల్పోవడమేనని అన్నారు మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేశారని అనంతరం ప్రజలకు అండగా ఉంటూ సేవలు అందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ముగ్గురు సర్పంచులను జైలుకు పంపించి బిఆర్ఎస్ నాయకుడి పై అక్రమంగా నిమజ్జనం సందర్భంగా కేసు నమోదు చేయించి జైలుకు తరలించి పైశాచిక ఆనందం పొందాలని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు ఈ సమావేశంలో కౌన్సిలర్లు అర్జునయ్యా కొత్త గంగాధర్, జయప్రకాష్ చారి మాజీ ఎంపీటీసీ సుధాకర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు: కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

