అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రెండు నెలల చిన్నారి మృతి అత్యంత దారుణమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్రేషియా ప్రకటించాలని, ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం పాలకుల వైఫల్యాన్ని చూపుతోందని విమర్శించారు.బాధితులకు న్యాయం చేయకపోతే శాసనసభలో తమ పార్టీ ఎమ్మెల్యేలు గళం విప్పుతారని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుడి-బడి ప్రాంతాల్లో కొనసాగుతున్న కులవివక్షకు పూర్తిగా తెరదించాలని పిలుపునిచ్చారు. మానవత్వంతో జరిగే ప్రతి పోరాటానికి బీజేపీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.: బాధితులపైనే కేసులు రాజ్యాంగ విరుద్ధం
