సలేశ్వరం జాతరకు విస్తృత ఏర్పాట్లు
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
అసెంబ్లీలో జీరో అవర్‌లో నాగర్‌కర్నూల్ ట్రాఫిక్, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం చర్యలు కోరారు.
మార్చి 28న నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి డి. రమాకాంత్ తెలిపారు. పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం పొందే అవకాశం ఉందన్నారు.
ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు ఆదేశించారు.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
నాగర్ కర్నూల్‌కు చెందిన టి-న్యూస్ రిపోర్టర్ రియాజ్ తండ్రి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా తుడుకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25న స్పెషలిస్ట్ వైద్యులతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి సూచించారు.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 34 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని అదనపు కలెక్టర్లు సూచించారు.
బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు.