ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ
నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొని గోపూజ నిర్వహించారు.
నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొని గోపూజ నిర్వహించారు.
గ్లూకోమా (నీటి కాసుల వ్యాధి) వారోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించి కంటి ఆరోగ్యంపై ప్రజలకు సూచనలు ఇచ్చిన అధికారులు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరగాలని స్పష్టం చేశారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి నాగర్ కర్నూల్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 637 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నో స్మోకింగ్ డే సందర్భంగా విద్యార్థులకు ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డుల ద్వారా విద్యార్థులకు ఆరోగ్యంపై ధూమపానం ప్రభావాలను వివరించారు.
లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న ఆశా కార్యకర్తలకు రెండు చొప్పున చీరలను అందజేశారు.
పొగ త్రాగడం వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదం. పాసివ్ స్మోకింగ్ వల్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం నో…
సృజనాత్మక ఆలోచనలతో మహిళలు ఆకర్షణీయమైన ఉత్పత్తులు తయారు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను కలెక్టర్ ప్రశంసించారు.