ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వీకుల జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అన్నదానం చేయడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెందుతారని, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గర్భవతులు, రోగుల సహాయకులు, చిన్నారులు సహా 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగుల కుటుంబ సభ్యులకు ఈ అన్నదానం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది.
అన్నప్రసాద కేంద్రం బాధ్యులు ఎలిమేశ్వరయ్య మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు లేదా ఇతర ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని అన్నదానం చేయదలచిన వారు నేరుగా కేంద్రాన్ని సంప్రదించవచ్చని లేదా 9441303182 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంతుల భారతమ్మ, మనస్విని, సాత్విక, సత్యసాయి అన్నప్రసాద కార్యదర్శి ఎలిమేశ్వరయ్య, సాయి ప్రకాష్, బాలయ్య, పాండు, కృష్ణయ్య, బాలకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం పంపిణీ





