నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు.

జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ వెల్లడించారు. పరీక్షల నిర్వహణ కోసం 4 మంది రూట్ ఆఫీసర్లు, 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 20 మంది కస్టోడియన్లు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 120 మంది సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు, అలాగే 519 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.

పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు తమ వెంట తీసుకురావాలని తెలిపారు. హాల్ టికెట్లను మీసేవ కేంద్రాల ద్వారా కూడా పొందవచ్చని చెప్పారు.అదేవిధంగా పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్లపై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని డీఈఓ పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాలకు తీసుకురాకూడదని విద్యార్థులకు సూచించారు.

జిల్లాలో మొత్తం 265 పాఠశాలలకు చెందిన 10,658 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 5,294 మంది బాలురు, 5,364 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు.

జిల్లాలో 6 ప్రభుత్వ పాఠశాలలు, 122 జిల్లా పరిషత్ పాఠశాలలు, 20 కేజీబీవీలు, 1 ఎయిడెడ్ పాఠశాల, 2 తెలంగాణ మోడల్ స్కూల్స్, 7 టీజీ రెసిడెన్షియల్ పాఠశాలలు, 4 ఎంజేపీటీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ పాఠశాలలు, 2 సోషల్ వెల్ఫేర్, 7 ట్రైబల్ రెసిడెన్షియల్, 8 మైనార్టీ రెసిడెన్షియల్, 2 ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు మరియు 66 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ డీఈఓ రమేష్ కుమార్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.: పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *