నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సీసీ కెమెరా వ్యవస్థ, హాల్ టికెట్ల తనిఖీ విధానం, పోలీస్ బందోబస్తు వంటి అంశాలను ఆయన పరిశీలించారు.

పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటూ, మాల్ ప్రాక్టీస్‌కు ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ పరీక్ష కేంద్రంలో మొత్తం 98 మంది విద్యార్థులకు గాను 96 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని మొత్తం 34 పరీక్షా కేంద్రాల్లో 6125 మంది విద్యార్థులకు గాను 5936 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, 189 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ వెల్లడించారు.: తాడూరు ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *