నాగర్ కర్నూల్ మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి.కురుమయ్యకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టియు) ప్రతినిధులు ఘన సన్మానం నిర్వహించారు. ఎమ్మార్సీ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఇంతకుముందు జిల్లా పరిషత్ పాఠశాల గుడిపల్లి ప్రధాన ఉపాధ్యాయులుగా సేవలందించిన కురుమయ్యను రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ మండల విద్యాధికారిగా నియమించింది.

కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రమేష్, కార్యదర్శి డి. ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మురళి, అసోసియేట్ ప్రెసిడెంట్ కరుణాకర్, ఎస్. ఈశ్వర్, నరసింహ, నారాయణ, బాలస్వామి, మధుసూదన్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొత్త బాధ్యతల్లో కురుమయ్య సమర్థవంతంగా పనిచేసి మండలంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.: మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *