నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. తారా సింగ్ మాట్లాడుతూ, సంబంధిత ఎస్ఓ మరియు సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్ఓను టర్మినేట్ చేసి సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.: కోడేరు కేజీబీవీ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం
