నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో సత్యసాయి అన్నప్రసాద కేంద్రం ద్వారా గత ఏడు సంవత్సరాలుగా నిరంతరంగా నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కృపాకటాక్షలతో శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్, భగవాన్ శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన ట్రస్ట్, సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు రోగి సహాయకులకు ఒకపూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు.

ట్రస్ట్ చైర్మన్ ఎలిమే ఈశ్వరయ్య తెలిపిన వివరాల ప్రకారం రోజుకు సుమారు 120 నుండి 150 మంది వరకు రోగి సహాయకులు ఈ సేవను పొందుతున్నారు. పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మరింత విస్తృతంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో కుటుంబ సభ్యులు స్వయంగా వచ్చి అన్నదానం చేయవచ్చని సూచించారు. ఈ రోజు వాస ఈశ్వరయ్య పేరిట అన్నప్రసాదం నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో గంధం సాయి ప్రకాష్, పాండు, రంగారావు ,బాలయ్య, పోల నాణ్యం, పోల రాము ,శేఖరా చారి ,లక్ష్మణ్, యాదగిరి తదితర సేవకులు పాల్గొన్నారు. దాతలు మరిన్ని వివరాలకు 9441303182 నంబర్‌ను సంప్రదించవచ్చు.: జిల్లా ఆసుపత్రిలో సత్యసాయి నిత్య అన్నప్రసాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *