ఈ సందర్భంగా కళాశాలలోని ఎస్సీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్య మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ఉపయోగపడుతున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల సమీపంలోని బస్ స్టాప్ వద్ద బస్సులు ఆగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ఆగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థులు మాట్లాడుతూ ఎమ్మెల్యే తండ్రి Kuchukulla Damodar Reddy కూచుకుళ్ల ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పించారని పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు RTF చెక్కులు





