నాగర్ కర్నూల్ జిల్లా చెంచు పెంటల్లో నివసిస్తున్న ఆదివాసీ చెంచు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడానికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సంస్థతో ఎంవోయూ కుదుర్చుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్లో తన ఛాంబర్లో ఐటీడీఏ, గృహ నిర్మాణ శాఖ అధికారులు మరియు ఆర్డీటీ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెంచు ప్రజలు ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్వయంగా ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నందున అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించేందుకు ఆర్డీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఐటీడీఏ పరిధిలోని ఐదు జిల్లాల్లోని 2,156 చెంచు పెంటల్లో సమగ్ర సర్వే నిర్వహించి 42 అంశాలపై సమాచారం సేకరించి ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి ఇంటిలో నివసించే వారికి ఆధార్, రేషన్ కార్డు, జన్ మన్ కార్డు, ఆయుష్మాన్ భారత్, కిసాన్ కార్డు తదితర కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ సంగప్ప, ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్, ఆర్డీటీ హ్యాబిటేషన్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, భవ్య నారాయణ, నాగరాజు, రామ్మోహన్, రాధ తదితరులు పాల్గొన్నారు.: చెంచుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్‌డీటీతో ఒప్పందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *