ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి విద్యను పూర్తిచేసుకొని ఉపాధి దిశగా ముందుకు సాగుతూ సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాటలు, నృత్యాలు, నాటికలతో విద్యార్థులు ప్రేక్షకులను అలరించారు. మొత్తం 95 టీంలతో వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే విద్యార్థులు శాస్త్ర సాంకేతిక అంశాలపై రూపొందించిన నివేదికలను కూడా అద్భుతంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ప్రిజం స్కూల్ యాజమాన్యం కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ దాసర్ల దేవేందర్, స్వప్న పాల్గొని విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సామూహికంగా భోజనాలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు దేవేందర్, పవన్, రామకృష్ణ, సలీమ్, భలిందర్, భరత్, వసంతతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్‌లో ప్రిజం విద్యాసంస్థ దశాబ్ది వేడుకలు ఘనంగా





