కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి గారు కార్యక్రమాన్ని ప్రారంభించి, కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి కళాశాల ప్రాంగణంలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత మరియు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కృష్ణయ్య, ధర్మ, సతీష్, కృష్ణ, సుధాకర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక సేవా భావన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.: నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన
