నాగర్కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, మహిళలు తదితర 10 థీమ్లతో కార్యక్రమం కొనసాగనుంది. ప్రతి థీమ్కు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. కార్యక్రమాలను ఫొటోలు, వీడియోలతో డాక్యుమెంటేషన్ చేసి రోజువారీగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.మార్చి 6 నుంచి 15 వరకు పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ థీమ్ అమలు చేయనున్నారు. అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.: నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *