రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామ సభలను నిర్వహించేందుకు సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే వివరించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యచరణ ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగోను కూడా రూపొందించారని పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణంలోని 8వ వార్డులో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయాలి








