ఆలయంలో నవగ్రహ, పవమాన హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ సీతా సమేత మూలా రాముల స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద చింతరేవుల ఆంజనేయస్వామి అన్నప్రసాద ట్రస్ట్ సత్రంలో జగన్నాథ దాసుల వారి ఆరాధన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు.
మధ్వ సంప్రదాయంలో జగన్నాథ దాసుల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. పీఠాధిపతులు ప్రవచనంలో జగన్నాథ దాసుల పూర్వ వైభవం, విశిష్టతను వివరించారు. దాసుల వారి కీర్తనలు, హరికథ, అమృతసార పారాయణం, విష్ణు నామస్మరణ, భజనల ద్వారా భక్తులు వారిని స్మరించుకుంటారని తెలిపారు.
ఆదివారం కావడంతో బెంగళూరు, హైదరాబాద్, ఉడిపి, మంగళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం పీఠాధిపతులు నివేదించిన ప్రత్యేక ప్రసాదాలతో పాటు అన్నప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు పీఠాధిపతుల చాతుర్మాస దీక్షలు కొనసాగనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆద్య వామనాచారి, ఆద్య కిష్టాచారి, ఆద్య మద్వాచారితో పాటు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.: పెద్ద చింతరేవులలో వైభవంగా జగన్నాథ దాసుల ఆరాధన..




